ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఒక్క ఇంటి నిర్మాణమే కాదు.. బాల్కనీ ఎటు ఉండాలి..పార్కింగ్ ప్లేస్ కు ఎంట్రన్స్ ఏ దిక్కులో ఉండాలి.. .మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: మేము మూడేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. సౌత్ ఫేసింగ్. మా ఇంటికి నైరుతిలో బాల్కనీ ఉంది. అక్కడ బాల్కనీ ఉండొద్దని బంధువులు చెప్పారు. ఇది ఎంత వరకు నిజం.
►ALSO READ | Womens Day 2026 : పులిని కాళ్లతో తొక్కిపట్టి చంపిన వీర నారి.. రాయబాగిన్ రాణి శంకరమ్మ
జవాబు:బాల్కనీ నైరుతిలో పనికిరాదు. వీలైనంత వరకు వాడకుండా ఉండాలి. అవసరమైతే ఆ దిక్కులో ఉన్న తలుపును మూసేయాలి. ఒకవేళ బాల్కనీ పెట్టుకోవాలనుకుంటే, నాలుగు వైపులా ఏర్పాటు చేసుకోవడం మంచిది
ప్రశ్న: మా ఇంటికి పడమర నైరుతిలో కొంత స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని పార్కింగ్ గా మార్చి వాడుకుంటున్నాం. నైరుతిలో బరువు ఉండాలని, ఆ స్థలాన్ని పార్కింగ్ కి వాడుతున్నాం. అలా వాడొచ్చా?
►ALSO READ | Womens Day 2026 : మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనక రీజన్ ఏంటీ..?
జవాబు: నైరుతిని పార్కింగ్ గా వాడుకోవచ్చు. పార్కింగ్ అయినా బరువే కదా. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈశాన్యంలో బరువు ఉంటే మాత్రం కచ్చితంగా చెడు ప్రభావం ఉంటుంది. ఇంటికి ఖాళీస్థలం పడమర వైపు తక్కువగా, తూర్పు వైపు ఎక్కువగా ఉండాలి. నైరుతిలో ఉన్న పార్కింగ్ కు వాయువ్యం దారి మాత్రమే వాడాల్సి ఉంటుంది, పార్కింగ్ లోకి దారి ఎటువైపు ఉందనేది ముఖ్యమని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.
